వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడిచినా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ మోసం చేసిన మే 6వ తేదీని పురస్కరించుకుని, కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు గుర్తుచేసేలా రైతులతో సమావేశం నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు.