తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, స్టేషన్ ఘనపూర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రెటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం, 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను కూడా పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.