జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిమ్మంపేట శివారులో బోళ్లమత్తడి వద్ద నీటిలో కొట్టుకుపోయిన బక్క శ్రావ్య అనే యువతి మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. ఈ ఘటన నేపథ్యంలో, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.