ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో నామినేషన్ దాఖలు ప్రక్రియ చివరి రోజున అభ్యర్థులు భారీ ర్యాలీలతో కేంద్రాలకు చేరుకున్నారు. పార్టీల బీ ఫారం సంగతి తర్వాత చూసుకుని, ముందుగా నామినేషన్ దాఖలు చేయాలనే ధీమా చాలామందిలో కనిపించింది. సాంకేతిక సమస్యలుంటే ఉపసంహరణలోపు సర్దుబాటు చేసుకోవచ్చనే ఆలోచనతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.