చిల్పూర్ మండలం పల్లగుట్టలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరిగిన ఊరేగింపులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. కాంగ్రెస్ నాయకులు తమపై మొదట దాడి చేశారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుండగా, ఊరేగింపులో వెళుతున్న తనను పిలిచి దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ పరస్పర దాడిపై పోలీసులు విచారణ చేపట్టారు.