హన్మకొండ జిల్లాలో 2026-28 కాలానికి జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుల జారీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కమిటీ పరిశీలించిన జాబితాకు భిన్నంగా, రాజకీయ సంబంధాలు ఉన్నవారికి, అర్హత లేని వారికి కార్డులు మంజూరు చేశారని, దీనివల్ల నిజమైన అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.