దేశంలోనే జోకర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం హనుమకొండలో బీఆర్ఎస్ నాయకులు తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంయుక్తంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు దున్నపోతు మీద నీళ్లు పడినట్లు ఉందని, పార్టీ పరంగా ఒక మాట, ప్రజల ముందు మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశంలోనే జోకర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుందని వారు అన్నారు.
