హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, ప్రతి సామాజిక వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమారంలోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సామాజిక న్యాయం ఆవశ్యకతను, అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.