తోటలో సురేష్ అనుమానాస్పద మృతి

14చూసినవారు
తోటలో సురేష్ అనుమానాస్పద మృతి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామంలో ముత్యాల సురేష్ (30) అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. గ్రామంలోని తోటలో మృతదేహం లభ్యమవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్