కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాపం తగులుతుంది

12చూసినవారు
ఎర్రటి ఎండల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాపం తగులుతుందని జాఫర్ ఘడ్ మండల బిజెపి అధ్యక్షులు కోరుకొప్పుల నాగేష్ గౌడ్ అన్నారు. మండలంలోని చాలా గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందని, జి తమ్మడపల్లి మీదుగా జాఫర్ ఘడ్ మండల కేంద్రం వరకు రోడ్లపై వడ్లు, మొక్కజొన్నలు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని, రైతులపై నెపం నెట్టేసి చేతులు దులుపుకునే అధికార యంత్రాంగం ఉందని ఆయన విమర్శించారు. వడ్లు, మొక్కజొన్నలు ఎండిపోయినా కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్