రెండో విడత ఐదు మండలాల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ

1చూసినవారు
హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ధర్మసాగర్, హసన్ పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. మొదటిరోజు సర్పంచ్ స్థానాలకు 51, వార్డు స్థానాలకు 44 నామినేషన్లు దాఖలయ్యాయి.