రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌కు చెందిన సాయికృప (23) వరంగల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పద్మ, మోహన్ రెడ్డి దంపతుల కుమార్తె అయిన సాయికృప, వరంగల్‌లో ఫిజియోథెరపీ చదివి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. విధులను ముగించుకుని రాత్రి తన గదికి వెళ్లిన ఆమె, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.