బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనా స్థలాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పోలీస్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. పండుగ ప్రశాంతంగా జరిగేందుకు ముందుస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గోవుల పరిరక్షణ కోసం చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు.