
సమత విద్యాసంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ
సంక్రాంతి పండుగను పురంస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండల కేంద్రంలోని సమత డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో విద్యార్థులు సంక్రాంతి పండుగ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా అందమైన రంగవల్లులు వేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కోటా రఘునాథరెడ్డి, ఆయా కళాశాలల ప్రిన్సిపల్ లు వెంకన్న, రవీందర్, చంద్రభాను న్యాయ నిర్ణీతలు అశోక్, సర్వి అశోక్, కళావతి, వెంకన్న, ఆధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.














