వరంగల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లు సీజ్

6చూసినవారు
వరంగల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లు సీజ్
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. జఫర్గడ్, ఐనవోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. సుమారు 9 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు బాధ్యులైన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్