
చెత్త కాలుస్తుండగా పేలిన సీసాలు... మహిళకు తీవ్ర గాయాలు
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఇందిరమ్మ కాలనీలో కొల్లు ధనలక్ష్మి తన ఇంటి ఆవరణలో చెత్తను కాలుస్తుండగా, వేడికి చెత్తలోని బాటిళ్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో ఆమె చేతి వేళ్లు తెగిపడటంతో పాటు ముఖం, శరీరంపై గాజులు గుచ్చుకొని తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
































