
ఐదు రోజుల్లోగా పంట నష్టంపై నివేదిక ఇవ్వండి: సీఎం చంద్రబాబు
AP: మొంథా తుఫాన్ ఏపీలో ప్రళయం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే గురువారం తుఫాన్ ప్రభావ పరిస్థితి, పంట, ఆస్తి నష్టం పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టం పై ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు ఆయన తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తి. అరటి, ఇతర ఉద్యాన వన పంటలు బాగా దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఐదు రోజుల్లోగా పంట నష్టంపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.




