వరంగల్ రైల్వేస్టేషన్ లో గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు శివనగర్ ఫ్లాట్ ఫార్మ్ పై అమ్మాయిలను టీజ్ చేస్తూ, ప్రయాణికులను డబ్బులు అడుగుతూ ఇబ్బంది పెట్టారు. ప్రతిరోజూ ఇలా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, గంజాయి మత్తులో మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.