వరంగల్ ఖిలా వరంగల్లో యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుకోటకు చెందిన సంగరబోయిన సాయి(24) పై మద్యం మత్తులో స్నేహితులు గొడవపడి దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటనలో బొళ్ల రాజేష్, బంగారు వినీత్, బంగారు నవీన్, బంగారు రాజులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. మిల్స్ కాలనీ సీఐ రమేశ్ ఈ వివరాలను వెల్లడించారు.