వరంగల్ కాశిబుగ్గ సెంటర్లో వంగరి పరపతి సంఘం ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం వద్ద బాటసారులకు, ప్రజలకు అంబలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వంగరి పరపతి సంఘం అధ్యక్షులు వంగరి జయప్రకాష్, కోశాధికారి వంగరి రవి, భద్రకాళి మాజీ డైరెక్టర్ సాంబార్ మల్లేశం, కాశిబుగ్గ పద్మా నగర్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు గంజి పున్నమి చందర్, చింతం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమం ప్రజల మన్ననలు పొందింది.