ఆదివారం వరంగల్ కోటలోని ఖుష్ మహల్ ప్రక్కన గల గ్రౌండ్ లో అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖల సహకారంతో, తెలంగాణలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ నృత్య బృంద ప్రదర్శన జరగనుంది. వందలాది నృత్యకారిణులు ఆరు నిముషాలపాటు కాకతీయుల వైభవంపై రూపొందించిన పాటపై శాస్త్రీయ నృత్యోత్సవంలో పాల్గొంటారు. ఈ ప్రదర్శన ద్వారా నృత్యకారులందరూ ఒకేసారి, ఒకే తీరులో నృత్యం చేసి కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పాలని నిర్వాహకులు తెలిపారు.