వరంగల్ కాశిబుగ్గ శాంతినగర్‌లో ఆటో డ్రైవర్ అహ్మద్ ఖాన్ (38) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అహ్మద్ ఖాన్ తల భాగంలో గాయాలతో, రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని ఇంట్లో కిరాయికి ఉంటున్న రేజియా సమాచారం అందించింది. మృతుడి తల్లి ఎండి. రేహానా (60) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.