నగరంలో కొందరు ఆకతాయిలు వాహనాల నంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు. ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు ఇలాంటి దుశ్చర్యల కు పాల్పడుతున్నారు. కొంతమంది మరో వాహన నెంబరును అమర్చుతుండగా.. మరికొందరు అసలు నంబర్ ప్లేట్ లేకుండానే నడుపుతున్నారు. ఇంకొందరైతే వాహనం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ లేకుండానే రోడ్ల పై తిరుగుతున్నారు. ఇలాంటి వాహనాలు నగరంలో వందల సంఖ్యలో తిరుగుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, లాఅండ్‌ఆర్డర్ పోలీసులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఫేక్ నెంబర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి తీరుమారడం లేదు.