ఆయుర్వేద పీజీ స్టార్ కు బుదారపు తేజశ్రీ ఎంపిక

2చూసినవారు
ఆయుర్వేద పీజీ స్టార్ కు బుదారపు తేజశ్రీ ఎంపిక
ఆయుర్వేద విద్యా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పీజీ స్టార్ ప్రోగ్రామ్‌కు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్ బుదారపు తేజశ్రీ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 1600 దరఖాస్తుల్లో కేవలం వంద మందిని మాత్రమే ఆయుర్వేద విభాగం ఎంపిక చేసింది. వరంగల్ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బుధారపు శ్రీనివాస్, శ్రీలత దంపతుల కుమార్తె అయిన తేజశ్రీ రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు ఎంపిక కావడంతో, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ వారు లక్ష రూపాయల గ్రాంటును మంజూరు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you