రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే బదిలీ అయ్యారు. ఆమెను కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె స్థానంలో కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ చహత్ బాజ్ పాయ్ కి పోస్టింగ్ ఇచ్చారు.