వరంగల్ లో 3 నెలల రేషన్ కోటా పంపిణీ

4చూసినవారు
వరంగల్ నగరంలో నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ ప్రారంభమైంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం, ఇతర వస్తువులను లబ్ధిదారులకు అందిస్తారు. ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం లభిస్తాయి. అంత్యోదయ కార్డుదారులకు నెలకు 35 కేజీల చొప్పున మూడు నెలలకు 105 కిలోల రేషన్ అందుతుంది. రేషన్ షాపులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్