ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ (ఈస్ట్) లోని హన్మకొండ మండలం కాజిపేట్ ప్రశాంత్ నగర్ కాలనీలో శ్రీలక్ష్మి గణపతి మంటపం వద్ద నవరాత్రుల సందర్భంగా ఆదివారం మహా గణపతి విగ్రహానికి కుటుంబ సమేతంగా ప్రజలు పూజలు చేశారు. ఏడవ రోజు అన్న ప్రసాద వితరణను నిర్వహకులు ఏర్పాటు చేయగా, కాలనీ వాసులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.