వరంగల్ పరిధిలోని ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ తో కలిసి మంత్రి కొండా సురేఖ క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరద ముంపు బాధితులను పరామర్శించి, సహాయక చర్యలను సమీక్షించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని భరోసా కల్పించారు.