కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వరంగల్ కాశీబుగ్గ అంబేద్కర్ జంక్షన్ లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ప్రతులను రైతు సంఘాల నాయకులు తగులబెట్టారు. ఈనెల 27 నుండి 31 వరకు నిరసన కార్యక్రమాలు చేయాలని మోర్చా ప్రకటించింది. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని ఆర్థిక వ్యవహారాల ఉప సంఘం ఈ ఖరీఫ్ సీజన్లో 14 రకాల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించిందని తెలిపారు.