గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన

1476చూసినవారు
గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
GWMC పరిధిలో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను వరంగల్ సెంట్రల్ డీసీపీ ధారా కవిత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరికికుంట, కడిపికొండ, హసన్‌పర్తి, భీమారం, గోపాల్‌పూర్, గుండ్ల సింగారం, బెస్తం చెరువు తదితర నిమజ్జన కేంద్రాలను సందర్శించి బ్యారికేడింగ్, లైటింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, క్రేన్లు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్