న్యాయవాదుల సమస్యలపై నిత్యం పోరాడుతూ, న్యాయవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం మడికొండలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్, కార్యదర్శి ఉదయ్ భాస్కర్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న బార్ కౌన్సిల్ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది. ఐఏఎల్ అభ్యర్థి దుస్సా జనార్దన్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సమావేశంలో తీర్మానించారు.