జనవరి 12 నుండి 16 వరకు చండీఘడ్ లో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలలో టేబుల్ టెన్నిస్ విభాగంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ పద్మ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, అధ్యాపక బృందం ఆమెను అభినందించి, పతకం సాధించాలని ఆకాంక్షించారు.