హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. సమ్మక్క-సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీలో ఎలుకల దాడులు పలుమార్లు జరుగుతున్నాయని, దీనిపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.