హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం గోపాలపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాద్ సుదనపల్లి గ్రామస్తులైన నవవధువు కుటుంబసభ్యులు నల్లపూసల వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.