వరంగల్ రాంకీలో ఫ్లాట్ల కొనుగోలుకు పెరిగిన డిమాండ్

12చూసినవారు
వరంగల్ బస్టాండ్ సమీపంలోని రాంకీ ఇన్ఫ్రాలో హౌసింగ్ బోర్డు అల్పాదాయ వర్గాల కోసం నిర్మించిన 102 గృహాలకు ఊహించని స్పందన లభిస్తోంది. కేవలం రూ. 19 లక్షల నుండి రూ. 21 లక్షల లోపే ఇల్లు లభిస్తుండటంతో సామాన్యులు పోటీ పడుతున్నారు. జనవరి 3లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, జనవరి 8న నిర్వహించే లక్కీ డ్రాలో అవకాశం కల్పిస్తామని హౌసింగ్ బోర్డు తెలిపింది. బస్టాండ్‌కు సమీపంలో ఉండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్