విద్యార్థులను కాపాడిన ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్‌కు ప్రశంసలు

711చూసినవారు
విద్యార్థులను కాపాడిన ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్‌కు ప్రశంసలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్, విద్యార్థులను పొగాకు ఉత్పత్తులు, గుట్కా, తంబాకు వంటి వ్యసనాల నుంచి రక్షించేందుకు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలకు గుర్తింపు పొందారు. బుధవారం జరిగిన పోలీస్ కమిషనర్ క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయనకు అప్రిషియేషన్ సర్టిఫికెట్‌తో పాటు నగదు బహుమతిని వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ అందజేశారు. విశ్వేశ్వర్ సేవలు పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలుస్తాయని కమిషనర్ ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్