వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన పదకొండేళ్ల బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. మార్చి 27న స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన బాలిక, అదే ప్రాంతానికి చెందిన బాలుడితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రత్యక్షమైంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు.