వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్ష్మీపురంలో మే 20న తాళ్లపెల్లి సుమలత దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు ఉపయోగించిన కత్తిని కాశిబుగ్గలోనే కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వరంగల్ మహానగరంలోని కాశిబుగ్గ నడిరోడ్డుపై, వివేకానంద కాలేజీ సమీపంలోని దుకాణాల్లో ఎలాంటి అనుమతులు, నిఘా లేకుండా బహిరంగంగానే కత్తులు అమ్ముతున్నారని, దీనిపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో ఒకరి ప్రాణం బలితీసుకున్న ఈ కత్తుల వ్యాపారంపై పోలీసులు స్పందించాలని కోరుతున్నారు.