నేటి కేటీఆర్ వరంగల్ పర్యటన రద్దు

1541చూసినవారు
నేటి కేటీఆర్ వరంగల్ పర్యటన రద్దు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నందున, సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగాల్సిన పార్టీ పర్యటన, సమావేశాలు వాయిదా పడ్డాయి. వరంగల్ తూర్పు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశాలు కూడా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలను ఇదే వారంలో మరో తేదీన నిర్వహించనున్నట్లు, సవరించిన తేదీ, సమయాలను పార్టీ త్వరలో ప్రకటిస్తుందని వరంగల్ బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్