ఖిల్లా వరంగల్ తూర్పు కోట బొడ్రాయి దగ్గర పోచమ్మ గుడి కమిటీ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోచమ్మ తల్లి, గ్రామ దేవతల బొడ్రాయి వద్ద కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించి, కామదహనానికి నిప్పంటించారు. ప్రజలందరూ చెడు ఆలోచనలను దహనం చేసి, మంచి ఆలోచనలతో సమాజాభివృద్ధికి కృషి చేయాలని కార్పొరేటర్ ఈ సందర్భంగా సూచించారు.