వర్ధన్నపేటలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

7చూసినవారు
వర్ధన్నపేటలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు
వర్ధన్నపేట నియోజకవర్గంలోని కట్ర్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. సర్పంచ్ అభ్యర్థి సుల్తాన్ దుర్గమ్మ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం జరిగింది. బీఆర్‌ఎస్ మాజీ వార్డు సభ్యురాలు షేక్ చాందూబీ తన 50 మంది మద్దతుదారులతో కాంగ్రెస్ లో చేరారు. ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పార్టీ నాయకులు ఆమెకు సోమవారం కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు అభివృద్ధి పనుల వల్ల ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని వెంకటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్