పులిగిల్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థినిల కోసం రూపొందించిన క్యాలెండర్‌ను గ్రామ సర్పంచ్ ఇనుగాల ఐలోని పద్మ, ఉప సర్పంచ్ మల్లికార్జున్, వార్డు మెంబర్ కర్ణాకర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఐలోని పద్మ నూతన సంవత్సరం విద్యార్థినిలకు కొత్త ఆశలు, లక్ష్యాలు, విద్యలో పురోగతి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు పుల్యాల సంపత్ రెడ్డి క్యాలెండర్ ద్వారా విద్యార్థులలో కాలపాలన, క్రమశిక్షణ, చదువుపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో విద్య కీలకమని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని సీనియర్ ఉపాధ్యాయులు కటుకోజ్వల సతీష్ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం శుభాకాంక్షలు తెలియజేసింది.