
మెట్రో రైల్ లో ప్రీ వెడ్డింగ్ షూట్.. గంటకు రూ.7 వేలు
ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైళ్లలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు, పుట్టినరోజు వేడుకలకు అనుమతిని మంజూరు చేసింది. దీనికి గాను కదులుతున్న (మొబైల్) కోచ్‌లకు గంటకు రూ.7 వేలు, ఆగి ఉన్న కోచ్‌లకు రూ.5 వేలు చొప్పున రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.




