నడికూడ సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్ ఏకగ్రీవం

155చూసినవారు
నడికూడ సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్ ఏకగ్రీవం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ఆదేశాల మేరకు నడికూడ మండలంలోని వివిధ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నార్లపూర్ గ్రామ సర్పంచ్ పెద్ద బోయిన రవీందర్ యాదవ్ ను నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా, రామకృష్ణాపురం సర్పంచ్ పెండ్లి లక్ష్మిని ప్రధాన కార్యదర్శిగా, కంటాత్మకూర్ సర్పంచ్ కొంగంటి తిరుపతిని ఉపాధ్యక్షుడిగా, రాయపర్తి సర్పంచ్ రాజు జగత్ ప్రకాష్ ను కోశాధికారిగా, ధర్మారం సర్పంచ్ భాషిక ఎల్లస్వామిలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతనంగా ఎన్నికైన పదాధికారులను అభినందిస్తూ, మండల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్