గోవిందరాజులస్వామి రధోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని డీఈ ఎస్ మల్లికార్జున్ తెలిపారు. విద్యుత్ తీగల తొలగింపు, పునరుద్ధరణ కారణంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పిన్నవారివీధి, దుర్గేశ్వరస్వామి దేవాలయం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎస్వీఎన్రోడ్, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జేపీఎన్రోడ్, ఏరియాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.