చేపల వలలో కొండచిలువ మృతి: వర్ధన్నపేటలో కలకలం

3013చూసినవారు
వర్ధన్నపేట కట్ర్యాల గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు వేసిన వలలో పది అడుగులకు పైగా ఉన్న కొండచిలువ మృతిచెంది కనిపించింది. శనివారం వలను తీసి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కుమార్ అనే వ్యక్తి వలలో ఈ కొండచిలువ చిక్కింది. తోటి చేపలు పట్టేవారి సహాయంతో దానిని బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్