న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హన్మకొండలో ఒక వ్యక్తిని బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేయగా, డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్ 432 గా నమోదైంది. 2025 సంవత్సరంలో ఇదే అత్యధిక రికార్డు అని పోలీసులు తెలిపారు.