వరంగల్: స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ పై సమీక్ష సమావేశం

74చూసినవారు
వరంగల్: స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ పై సమీక్ష సమావేశం
వరంగల్ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ పై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ. జిల్లాలో ఒడిఎఫ్ అమలు తీరులో జిల్లా ముందు వరుసలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమం అమలుతీరులో భాగంగా అంతరాలను తొలగించడానికి ప్రతి కాంపౌండెంట్ నుంచి గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పకడ్బందీగా చేయాలన్నారు.