పరకాల పట్టణ కేంద్రంలో శనివారం నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా, బాపూజీ నిజమైన ప్రజా నాయకుడు, ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు అని, తెలంగాణ సాధనలో ఆయన పాత్ర అపూర్వమని ఎమ్మెల్యే కొనియాడారు.