ఎల్కతుర్తి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఢీ, ప్రయాణికుల్లో భయాందోళన

1360చూసినవారు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో బుధవారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. హనుమకొండ, సిరిసిల్ల డిపోలకు చెందిన ఈ బస్సులు డ్రైవర్ల అజాగ్రత్త వల్లే ప్రమాదానికి గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో రెండు బస్సులకు స్వల్పంగా నష్టం వాటిల్లగా, ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదని డ్రైవర్లు తెలిపారు. అయితే, ప్రమాద సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్